బైక్ నడిపిన మైనర్…తండ్రికి రెండు రోజుల జైలు

jailరోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు విధించిన నిబంధనలను కొందరు అతిక్రమిస్తూనే ఉన్నారు. రూల్స్ ను అతిక్రమించిన వారికి జరిమానా విధిస్తున్నా… ఇష్టారాజ్యంగా ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తూనే ఉన్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే పేరెంట్స్ కు జైలు శిక్ష తప్పదని కూడా హెచ్చరించారు. అయినా  పట్టించుకోవడం లేదు.

రెండు రోజుల క్రితం హైదరాబాద్ గాంధీనగర్ లో ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు. ఇందులో ఓ బాలుడు బైక్ నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో ఆ బాలుడి తండ్రికి కోర్టు రెండు రోజుల జైలుతోపాటు జరిమానా విధించింది. బన్సీలాల్‌పేట్‌కు చెందిన క్రిష్ణ ఆర్టీసీలో రిటైర్డ్ ఉద్యోగి. అతని కుమారుడు (11) రెండు రోజుల క్రితం బైక్‌పై వెళ్తున్నాడు. పోలీసుల తనిఖీలో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా మైనర్ అని తేలింది. పోలీసులు బాలుడి తండ్రి క్రిష్ణపై కేసు నమోదు చేసి నాంపల్లి ప్రత్యేక కోర్టులో హాజరుపర్చగా… న్యాయమూర్తి అతనికి రెండు రోజుల జైలు శిక్షతో పాటు రూ.1000 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.

Posted in Uncategorized

Latest Updates