బోణీ కొట్టిన ముంబై : రాయల్ చాలెంజర్స్ పై గ్రాండ్ విక్టరీ

IPLIPL సీజన్-11లో ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది. మొదటి మూడు మ్యాచుల్లో ఓడిపోయిన రోహిత్ సేన.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మీద గ్రాండ్ విక్టరీ కొట్టింది. 46 పరుగుల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. మంగళవారం (ఏప్రిల్-17) వాంఖెడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్  రోహిత్ శర్మ తన అద్భుతమైన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. మొదట బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్….20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు చేసింది.

రోహిత్ శర్మ 52 బంతుల్లో 10 ఫోర్లు, 5సిక్సులతో 94 పరుగులు చేశాడు. ఓపెనర్  ఎవిన్  లూయీస్ 42 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్ లు తో 65 రన్స్ సాధించాడు. ఇక 214 పరుగులు టార్గెట్ తో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు…మొదట్లో  ధాటిగానే బ్యాటింగ్ ప్రారంభించింది. కానీ టార్గెట్ ను రీచ్ కావడంలో ఫెయిల్ అయింది. కోహ్లీ ఒక్కడే ఒంటరు పోరు చేశాడు. దాంతో 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 167 పరుగులే చేయగలిగింది బెంగళూరు.

Posted in Uncategorized

Latest Updates