బోదకాలు బాధితులను ఆదుకుంటాం: కేసీఆర్

elephntiasis
ఆరోగ్య సమస్యలతో బాధ పడే వారిని ఆదుకోవడంతో పాటు సరైన వైద్య సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఫ్రీగా వ్యాధి నిర్ధారణ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది.ఇందులో భాగంగా బోదకాలు బాధితులను ఆదుకోనుంది. వారికి ప్రతి నెలా వెయ్యి రూపాయల పింఛను ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. దీంతో రాబోయే బడ్జెట్లో నిధులు కేటాయిస్తామని చెప్పారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 47 మంది లబ్ధి పొందనున్నారు. చికిత్స కంటేనివారణే ముఖ్యమన్న మాటను ప్రభుత్వం ఆచరణలో పెట్టేందుకు డిసైడ్ అయ్యింది. గ్రామం యూనిట్‌గా ప్రజలందకీ ప్రభుత్వ ఖర్చుతోనే రోగ నిర్ధారణ పరీక్షలు చేయించాలని నిర్ణయించింది. వైద్య ఆరోగ్య శాఖపై సీఎం కేసీఆర్‌ శుక్రవారం(ఫిబ్రవరి-9) ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. గ్రామస్థాయిలో వైద్యాధికారులు.. సిబ్బంది సేవలను మరింత వినియోగించుకునేందుకు కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు సీఎం కేసీఆర్.

Posted in Uncategorized

Latest Updates