బోనమెత్తిన భాగ్యనగరం: గోల్కొండలో శ్రీకారం


భాగ్యనగరం బోనమెత్తింది. రాజధాని నగరంలో ఆషాడ బోనాల సందడి మొదలైంది.  గోల్కొండ జగదాంబ  అమ్మవారికి  తొలి బోనంతో ఉత్సవాలు షురూ అయ్యాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భారీ ఏర్పాట్లు చేసింది. ప్రతి ఏడాది లాగానే  గోల్కొండ జగదాంబిక అమ్మవారి ఆలయం నుంచి బోనాల ఉత్సవాలు మొదలయ్యాయి. మధ్యాహ్నం 12 గంటలకు లంగర్ హౌస్ లో మంత్రులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిచడంతో తొట్టేల ఊరేగింపు  మొదలు కానుంది. ఊరేగింపు మొదట బడా బజార్ లోని పూజారి ఇంటికి  చేరుకుంటుంది. అక్కడ అమ్మవారికి  ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఉత్సవ విగ్రహం ఊరేగింపు ప్రారంభమువుతుంది. తర్వాత బజార్ దర్వాజా దగ్గర అమ్మవారికి పటేలమ్మ సాక సమర్పించాక సాయంత్రం కోటపైకి చేరుకుంటుంది.

ఆదివారం(జూలై-15) నుంచి ఆగస్టు 12 వరకు గోల్కొండ కోటలో జగదాంబిక అమ్మవారి బోనాల జాతర జరగనుంది. ఇక్కడ ఆది, గురువారాల్లో నెల రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అమ్మవారి దర్శనం, మొక్కులు చెల్లించుకోవడం కోసం లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. బోనాల జాతరకి వచ్చే భక్తుల కోసం వారంలో 3 రోజుల పాటు గోల్కొండ కోటలో ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు అధికారులు.


Posted in Uncategorized

Latest Updates