బోనాలకు ముస్తాబైన ఓల్డ్ సిటీ

బోనాల ఉత్సవాలకు హైదరాబాద్ పాతబస్తీ ముస్తాబైంది. ఈ నెల 5న హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో బోనాల పండుగ నిర్వహించనున్నారు. దీంతో  ఇప్పటికే దేవాలయాలను విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు. ఘటాల ఊరేగింపులో భాగంగా ఉప్పుగూడ నుంచి ఢిల్లీ గేట్ వరకు 1500 తాత్కాలిక విద్యుద్దీపాలను ఏర్పాటు చేశారు అధికారులు. ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ నిర్వాహకుల సూచనలతో ప్రధాన దేవాలయాల దగ్గర 25 ఎల్‌ఈడీ విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు చాంద్రాయణగుట్ట, సంతోష్‌నగర్ సర్కిల్ పరిధిల్లోని దేవాలయాల దగ్గర బోనాలు, ఊరేగింపుల కోసం 6 వేల లైట్లతో అలంకరించారు అధికారులు.

బోనాల పండుగ సందర్భంగా ఈ నెల 5,6 తేదీల్లో మద్యం షాపులను మూసివేయాలని రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో పండగ జరుపుకోవాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మంగళ వారం ఉదయం 6 గంటల వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయన్నారు. ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.

Posted in Uncategorized

Latest Updates