బోనాలకు రూ.15 కోట్లు విడుదల : దేవాదాయ శాఖ

bonaluతెలంగాణ రాష్ట్ర అధికారిక పండుగ బోనాల ఉత్సవం జూలై 15వ తేదీన ప్రారంభం కానుంది. ఈ క్రమంలో బోనాల పండుగ నిర్వహణ కోసం రూ. 15 కోట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు దేవాదాయ శాఖ మంగళవారం (జూలై-3) ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం కేసీఆర్ నిర్ణయానికి అనుగుణంగా నిధులు విడుదల చేశారు. జూలై 15న గోల్కొండ జగదాంబిక అమ్మవారికి బోనాల సమర్పణతో ఉత్సవం ప్రారంభం అవుతుంది. జూలై 29న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించనున్నారు. జూలై 30న సికింద్రాబాద్‌ లో రంగం కార్యక్రమం నిర్వహించనున్నారు. అనంతరం ఆగస్టు 5న ఓల్డ్ సిటీలో బోనాలు జరగనున్నాయి. బోనాల సందర్భంగా సిటీలో భారీ ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపింది దేవాదాయశాఖ.

Posted in Uncategorized

Latest Updates