బోనాల జాతరకు ముస్తాబవుతున్న మహంకాళి అమ్మవారి ఆలయం

ammaబోనాల జాతరకు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం ముస్తాబవుతోంది. మరోవైపు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించేందుకు..నగలు చేయిస్తున్నారు ఆలయ అధికారులు. ఈ ఏడాది కంచి చీరతో పాటు ప్రత్యేక ఆభరణాలతో దర్శనమివ్వనున్నారు అమ్మవారు. బంగారు బోనంలో తల్లికి నైవేద్యం సమర్పించనున్నారు.

1813లో  నగర  ప్రజలకు  ప్లేగు  వ్యాధి  నుంచి  విముక్తి  కలిగించడానికి  ఉజ్జయిని నుంచి  నగరానికి  వచ్చిన  అమ్మవారికి  బోనాలు  నిర్వహించడం  ఆనవాయితీగా వస్తోంది. అప్పటి  నుంచి ఇప్పటివరకు ఘటోత్సవంతో బోనాల జాతర ప్రారంభిస్తారు. బోనాల తర్వాత అమ్మవారు చెప్పే భవిష్యవాణిని భక్తితో వింటారు. ఇలా   ప్రతి ఏడాది అమ్మవారిని కొలిచే భక్తులు సంఖ్య పెరగడంతో.. ఆలయం దగ్గర ప్రత్యేక ఏర్పాట్లు చేయడం మొదలైంది.

ప్రతీ ఏడాది అమ్మవారి బోనాల జాతరలో  ఏదో ఒక  ప్రత్యేకత  ఉంటుంది. ఈ ఏడాది కంచి చీర, బంగారు కాసుల పేరు, వజ్రాల బొట్టు ..వజ్రాల ముక్కు పుడకతో అమ్మవారు దర్శనమివ్వనున్నారు. అంతే కాదు అమ్మవారికి  బంగారు బోనంలో  నైవేద్యం సమర్పించనున్నారు.అమ్మవారికి భక్తులు ఐదు కిలోల 740 గ్రాముల  బంగారం సమర్పించారు. ఇందులో 3కేజీల 80గ్రాముల బంగారం ఉపయోగించి ఈ ఏడాది అమ్మవారికి  బంగారు బోనం తయారు చేయిస్తున్నారు ఆలయ అధికారులు. బోనంపై ప్రత్యేకంగా మహంకాళి, మాణిక్యాలంబ అమ్మవార్ల  విగ్రహాలు డిజైన్  చేయిస్తున్నారు. బోనం పై  సింపుల్ డిజైన్ ఉండనుంది.

ఇప్పటికే అమ్మవారి గర్భాలయం వెండిమయంగా మారింది. కానీ ఈ ఏడాది  బోనాల  వరకు అమ్మవారి  అర్ధ మండపం ..గర్భాలయ వాకిలీ  కూడా  వెండి  వెలుగుతో  కనిపించనుంది. దీనికోసం అమ్మవారి హుండీ నుంచి  80కేజీలు ..దాతల నుంచి  160కేజీల  వెండి  సేకరించనున్నారు. బోనాల జాతరలో అమ్మవారు ఈ ఏడాది కంచి నుంచి ప్రత్యేకంగా  రానున్న చీరలో, పెద్ద  పెండెంట్ ఉన్న  150గ్రాముల  బంగారు  కాసుల పేరు ..వజ్రాల  ముక్కు పుడక, వజ్రాల  బొట్టుతో  ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు.

కేవలం భక్తుల కానుకలతో మాత్రమే అమ్మవారికి బంగారు బోనం, నగలు చేయిస్తున్నట్లు చెప్పారు ఆలయ అధికారులు. జులై 15వరకు అమ్మవారి చీర, నగలు ఆలయానికి చేరతాయని.. వెండి అర్ధ మండపం, వాకిలీ 28వరకు  పూర్తవుతాయంటున్నారు. ఈ సారి ఆభరణాలతో అమ్మవారు ధగధగ మెరిసిపోనున్నారు. గర్భాలయం వెండి, బంగారు కలతో కళకళలాడనుంది.

 

Posted in Uncategorized

Latest Updates