బోనాల పండుగ: లిక్కర్ షాపులు బంద్

బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్, రాచకొండ పోలీసుల కమిషనరేట్ పరిధిలో రెండు రోజుల పాటు లిక్కర్  షాపులు బంద్ చేయాలంటూ శుక్రవారం(ఆగస్టు-3) పోలీసు కమిషనర్‌లు అంజనీకుమార్, మహేష్‌భగవత్‌లు ఉత్తర్వులు జారీ చేశారు. ఆదివారం(ఆగస్టు- 5) ఉదయం 6 గంటల నుంచి మంగళవారం(ఆగస్టు- 7) ఉదయం 6 గంటల వరకు కల్లు, , వైన్స్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్‌లలో మద్యం అమ్మకాలు నిషేధమన్నారు. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఎల్బీనగర్, మల్కాజిగిరి డీసీపీ జోన్‌ల పరిధిలలో ఈ ఆంక్షలు వర్తిస్తాయన్నారు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు పోలీసు ఉన్నతాధికారులు.

Posted in Uncategorized

Latest Updates