బోరుబావిలో చిన్నారి

బీహార్ రాష్ట్రం ముంగేర్ లో మూడేళ్ల చిన్నారి బోరుబావిలో పడింది. ఇంటిముందు ఆడుకుంటూ సన్నో అనే మూడేళ్ల బాలిక బోరుబావిలో పడిపోయింది. కొత్వాలిలోని ముర్గియా చాక్ పీఎస్ పరిధిలో ఈ ఘటన జరిగింది. 110 అడుగుల లోతులో ఉన్నట్టు గుర్తించారు అధికారులు. జూలై 31వ తేదీ మంగళవారం మధ్యాహ్నం అందులో పడిపోయింది. సాయంత్రానికి అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన సహాయ బృందాలు.. చిన్నారిని బతికించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

పైపులతో బోరుబావిలోకి ఆక్సిజన్ పంపుతున్నారు. సీసీటీవీ కెమెరాలు ద్వారా బాలిక కదలికలను గుర్తించారు. 225 అడుగుల లోతున్న బోరుబావిలో.. 110 అడుగుల దగ్గర చిన్నారి ఉన్నట్టు గుర్తించారు. అక్కడి నుంచి కిందకు జారకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చిన్నారిని రక్షించేందుకు మరింత సమయం పట్టొచ్చు అంటున్నారు అధికారులు. బోరుబావికి సమాంతరంగా గొయ్యి తీస్తున్నారు. అదే విధంగా పైనుంచే బయటకు తీసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. చిన్నారి ఉన్న ప్రాంతంలో నీళ్లు లేవని.. ప్రాణాలతో ఉందని చెబుతున్నారు అధికారులు.

Posted in Uncategorized

Latest Updates