బోలెడు వెరైటీలు : త్రీడీ ఫ్లోరింగ్ కు పెరిగిన డిమాండ్

38

GIRAఇంటికి సగం అందం ఫ్లోరింగ్ తోనే వస్తుంది. మార్బల్, టైల్స్ తో ఇళ్లల్లో ఫ్లోరింగ్ వేస్తుంటారు. అయితే ఫ్లోరింగ్స్ లో కూడా ఎన్నో వెరైటీస్ అందుబాటులోకి వచ్చాయి. అందులో త్రీడి ఫ్లోరింగ్స్ కి డిమాండ్ బాగా పెరిగిపోయింది.

ఇళ్లు అందంగా ఉండాలని ఎవరు కోరుకోరు. ఇంటీరియర్ నుంచి ఇంట్లో ఫ్లోరింగ్ వరకు అన్ని స్పెషల్ గా ఉండాలనుకుంటారు చాలామంది. అలాంటి వారి కోసం త్రీడీ ఫ్లోరింగ్ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉంది. మార్బుల్స్, టైల్స్ కంటే త్రీడి ఫ్లోరింగ్ ఇంటికి మంచి అందాన్ని తెస్తుంది. కాకపోతే ప్రతీ 6 నెలలకోసారి త్రీడీ ఫ్లోరింగ్ ను కచ్చితంగా మార్చాలి.

ఈ త్రీడి ఫ్లోరింగ్ ను ఎక్కువగా హోటల్స్ లో వేయిస్తున్నారు. కొందరు పిల్లల బెడ్ రూమ్స్ లకి ప్రిఫర్ చేస్తున్నారు. 3 డి ఫ్లోరింగ్ తో ఇంటికి మంచి క్లాస్ లుక్ వస్తుందంటున్నారు వ్యాపారులు. ఇందులో కూడా రెండు రకాలున్నాయని గ్లాస్ టైపు, మ్యాట్ టైపు త్రీడి ఫ్లోరింగ్ మార్కెట్లో అందుబాటులో ఉందని చెబుతున్నారు. గ్లాస్ టైప్ త్రీడి ఫ్లోరింగ్ ను ఎక్కువగా హోటల్స్ లో వేయిస్తున్నారని చెబుతున్నారు. మ్యాట్ కి అయితే 350, గ్లాస్ కి అయితే 750 స్క్వేర్ ఫీట్ ఉంటుందంటున్నారు.

Posted in Uncategorized

Latest Updates