బ్యాంకింగ్ ఉచిత సేవలు…GST పరిధిలోకి రాదు

atmఉచిత బ్యాంకింగ్‌ సేవలు GST పరిధిలోకి రావన్నారు కేంద్ర ఆర్థిక శాఖ సీనియర్‌ అధికారి ఒకరు. చెక్‌ బుక్‌ల జారీ, ఎటిఎంల నుంచి నగదు ఉపసంహరణ వంటి ఉచిత సేవలు GST పరిధిలోకి రావు. బ్యాంక్‌లు అందించే కొన్ని రకాల ఉచిత సేవలపై GST విధించడంతో ఈ విషయంపై నెలకొన్న గందరగోళాన్ని తొలగించాలంటూ ఆర్థిక సేవల విభాగం రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ను ఆశ్రయించింది. ఉచిత బ్యాంక్‌ సేవలపై GST వర్తించదని రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ త్వరలోనే ఆర్థిక సేవల విభాగానికి సమాచారం అందించనుందన్నారు ఆ సీనియర్‌ అధికారి. బ్యాంకుల యాజమాన్యాల తరఫున ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబిఎ) కూడా ఈ విషయంపై పన్ను శాఖకు ఇప్పటికే ఓ వినతి పత్రం సమర్పించింది.

Posted in Uncategorized

Latest Updates