బ్యాంకింగ్ వ్యవస్ధను మోడీ నాశనం చేశారు: రాహుల్ గాంధీ

RAHULదేశ బ్యాంకింగ్ వ్యవస్ధను నాశనం చేశారంటూ మోడీపై విరుచుకుపడ్డారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. డీమానిటైజేషన్ సమయంలో ఒలవంతంగా ప్రజలను ATMల దగ్గర క్యూలైన్లలో నిలబెట్టారన్నారు. మన దగ్గర ఉన్న 500, 1000 రూపాయల నోట్లను తీసుకెళ్లి వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ జేబులో పెట్టారని మోడీని విమర్శించారు రాహుల్ గాంధీ. దేశవ్యాప్తంగా ATM లలో ప్రస్తుతం నెలకొన్న నగదు కొరతకు కారణం మోడీ ప్రభుత్వమే అని రాహుల్ తెలిపారు.
ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, రాజస్ధాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాలలోని ATMలలో నగదు నిల్వలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ నగదు కష్టాలు తాత్కాలికమని, త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని అంతకుముందు అరుణ్ జైట్లీ తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates