బ్యాంకులకు పంగనామాలు : డబ్బులు ఉండి ఎగ్గొట్టింది రూ. లక్ష కోట్లు

bank-scamభారత్ లో రోజురోజుకి బ్యాంకులకు పంగనామాలు పెడుతున్న వ్యాపారవేత్తలు పెరిగిపోతున్నారు. సెప్టెంబర్ 30, 2017 నాటికి ఆయా పారిశ్రామిక వేత్తల దగ్గర డబ్బులు ఉండీ.. బ్యాంకులకు ఎగ్గొట్టిన సొమ్ము అక్షరాల ఒక లక్ష కోట్లు. వీళ్లందరూ ఉద్దేశపూర్వకంగా బ్యాంకులకు డబ్బు చెల్లించలేదు. వేల కోట్లు అప్పుతీసుకునే ముందు ఇస్తున్న సెక్యూరిటీ ఏ మాత్రం సరిపోవటం లేదు. బ్రాండ్ వ్యాల్యూ, సమాజంలో పలుకుబడి, చేస్తున్న వ్యాపారాలను దృష్టిలో పెట్టుకుని బ్యాంకులు విచ్చలవిడిగా ఇచ్చేస్తున్నాయి. ఈ తర్వాత చెల్లింపుల్లో ఈ బడా పారిశ్రామిక వేత్తలు పంగనామాలు పెడుతున్నారు. వేల కోట్ల ఆస్తులు ఉన్నా.. బ్యాంకులకు చెల్లించకుండా నాటకాలు ఆడుతున్నారు. కొందరు విదేశాలకు పారిపోతున్నారు.

ఇలా వేల కోట్ల ఆస్తులు ఉండి కూడా డబ్బు ఎగ్గొట్టిన సొమ్ము.. ఇప్పటి వరకు లక్ష కోట్ల అని తేల్చాయి బ్యాంకులు. ఈ జాబితాలో ఉన్న వారు పెద్ద పెద్ద వ్యాపారాలు. ఈ లిస్ట్ లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు జతిన్ మెహతా కు చెందిన విన్సమ్ డైమండ్స్ అండ్ జ్యూయలరీ లిమిటెడ్. ఇప్పటి వరకు వివిధ బ్యాంకులకు చెల్లించాల్సిన మొత్తం రూ.5వేల 500 కోట్లుగా ఉంది. ఈ జాబితాలో మరో ఘనుడు విజయ్ మాల్యా. కింగ్ ఫిషర్ లిక్కర్ ద్వారా వేల కోట్లు సంపాదిస్తున్నా.. బ్యాంకులకు మాత్రం సున్నం పెట్టాడు. మరో కంపెనీ REI అగ్రో. కోల్ కతా కేంద్రంగా సందీప్ జున్ జున్ వాలా నడుపుతున్న ఈ సంస్థ బ్యాంకులకు చెల్లించాల్సిన మొత్తం రూ.2,730 కోట్లు. ఈ కంపెనీ ఒకసారి లండన్, సింగపూర్ ఎక్సేంజీల్లో కూడా లిస్టెడ్ అయింది. మరికొన్ని ప్రముఖ కంపెనీలు కూడా వేల కోట్లు చెల్లించాల్సి ఉన్నాయి. బ్యాంక్ లెక్కల ప్రకారం 2017లోనే 27% బ్యాడ్ లోన్ లు పెరిగాయి.

 

Posted in Uncategorized

Latest Updates