బ్యాంకులపై ప్రజలకు నమ్మకం పోతుంది : రామ్ నాథ్ కోవింద్

bankబ్యాంకు  స్కాంలు.. అప్పు  ఎగవేతల  కారణంగా  ప్రజలకు  బ్యాంకులపై  నమ్మకం పోతోందన్నారు  రాష్ట్రపతి రాంనాథ్  కోవింద్. చార్టెడ్  అకౌంటెంట్స్ డే  సందర్భంగా ఢిల్లీలో  నిర్వహించిన కార్యక్రమంలో  ఆయన  మాట్లాడుతూ… ప్రజలు  కష్టపడి  దాచిపెట్టుకున్న  ధనాన్ని …కొందరు  దోచుకుని  మోసం చేస్తున్నారన్నారు.  దీనివల్ల కార్పొరేట్ ఎథిక్స్ కు ద్రోహం చేయడమే కాక, నిజాయితీ గల పౌరులను మోసం చేసినట్లవుతుందని కోవింద్ అన్నారు.  చార్టెడ్  అకౌంటెంట్ లు  బ్యాలెన్స్  షీట్ లు  సరిగ్గా  మెంటేయిన్ చేసి… ఇలాంటి సమస్యలు  రాకుండా  చూడాలన్నారు  కోవింద్.

Posted in Uncategorized

Latest Updates