బ్యాంకులు,పోస్టాఫీసుల్లో 18 వేల ఆధార్ సెంటర్లు

AADHARదాదాపు అన్ని స్కీంలకు ఆధార్ తో అనుంసంధానం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రజలు ఆధార్ కార్డును తీసుకునేందుకు సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. అక్కువగా ఆధార్ సెంటర్లు తక్కువగా ఉండటంతో సకాలంలో ప్రజలకు ఆధార్ కార్డులు ఇవ్వడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు, పోస్టాఫీసుల్లో 18 వేల చోట్ల ఆధార్‌ నమోదు సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఆధార్‌ నమోదుతోపాటు బయోమెట్రిక్‌ ఐడీ అప్‌డేషన్‌ చేసుకోవచ్చని యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ ఆథారిటీ (UIDAI) సీఈవో అజయ్‌ భూషణ్‌ పాండే తెలిపారు. కనీసం పది శాఖలకు ఒకటి చొప్పున ఆధార్‌ నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని గతేడాది జూలైలో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులను యూఐడీఏఐ కోరింది.

బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఆధార్‌ కేంద్రాల ఏర్పాటు కొనసాగుతోందన్నారు అజయ్ భూషణ్ పాండే. ఇప్పటి వరకు 18 వేల చోట్ల ఈ సదుపాయం కల్పించారు. మిగిలిన చోట్ల కూడా ఈ కేంద్రాలు ఏర్పాటవుతాయన్నారు. మొత్తం మీద 26 వేల కేంద్రాలు బ్యాంకులు, పోస్టాఫీసుల దగ్గర అందుబాటులోకి వస్తాయన్నారు.

Posted in Uncategorized

Latest Updates