బ్యాంకులు చెబుతున్నాయి : డబ్బు కొరతకు కారణాలు ఇవే

no-cashఅస్సాం, బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల్లో రెండు వారాలుగా ప్రజలు నగదు కొరత ఎదుర్కొంటున్నారు. కొన్ని రాష్ట్రాల్లో, ప్రజలు తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటూ ATMల దగ్గర నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ప్రస్తుతం లక్షా 25వేల కోట్ల నగదు కరెన్సీ చెలామణిలో ఉన్న డబ్బుకి ఎందుకు కొరత ఏర్పడింది.. దాని కారణాలు ఏంటీ అనేది ఓసారి చూద్దాం…

… నెల రోజుల నుంచి RBI సర్కిల్స్ లోని నగదు బదిలీ జరగటం లేదు. అనేక సర్కిళ్లలో అదనపు నగదు ఉంది. ఆ డబ్బుని ఇతర సర్కిల్స్ కు బదిలీ చేయడానికి రాష్ట్రాల వారీగా కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలు సమర్ధవంతంగా పని చేయటం లేదు. దీంతో ఆయా సర్కిల్స్ లోని డబ్బంతా అక్కడే ఉండిపోతుంది.

… ATMలలో  కొత్త రూ.200 నోట్లను ప్రవేశపెట్టినప్పటి నుంచి పెద్ద నోట్లను తగ్గించింది. అందుకు తగ్గట్టుగా చిన్న నోట్ల చెలామణిని పెంచలేదు. ATMల ద్వారా కొత్త కరెన్సీని అందుబాటులోకి తీసుకురావటంలో బ్యాంకులు విఫలం అయ్యాయి.

… ఉత్తర భారతంలో  బైసాఖి, బీహూ, ఇతర పండుగలు వరసగా వచ్చాయి. దీనికితోడు వరసగా వచ్చిన సెలవుల వల్ల దిగువ, మధ్య తరగతి ప్రజలు పెద్ద మొత్తంలో డబ్బులు విత్ డ్రా చేశారు.

… పెద్ద మొత్తంలో వేతనాల చెల్లింపు కూడా ఒక కారణం. పంటల సీజన్, వ్యవసాయ కార్మికులకు భారీ మొత్తంలో నగదు చెల్లించాల్సి వచ్చింది. దీని కోసం పెద్దమొత్తంలో డబ్బులు డ్రా అయ్యాయి. అదే సమయంలో కొన్ని రాష్ట్రాల్లో 2వేల రూపాయల నోట్ల సరఫరా బాగా తగ్గిపోయింది. ఇది నగదు కొరతకి కారణం అయ్యింది.

… కర్ణాటకలో ఎన్నికలు కూడా  నగదు కొరతకు ఒక కారణం. ఎన్నికల ప్రచారం ప్రారంభం అయినప్పటి నుంచి అక్కడ డబ్బుకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. బ్యాంకులు, ఏటీఎంల నుంచి క్యాష్ విత్ డ్రాలు పెరిగిపోయాయి.

… ఫైనాన్షియల్ రిజుల్యూషన్ – డిపాజిట్ ఇన్స్యూరెన్స్ బిల్ (ఎఫ్డిఐడి) బిల్లుతో బ్యాంకులో డబ్బుకు రక్షణ లేదనే పుకారు కూడా ఓ కారణం. ఈ వార్తతో సామాన్యులు పెద్ద ఎత్తున తమ డిపాజిట్లను బ్యాంకు నుంచి ఉపసంహరించుకున్నారు. దీంతో బ్యాంకుల్లో నగదు కొరత ఏర్పడింది. అందుకు తగ్గట్టుగా డిపాజిట్లు పెరగలేదు. ఇది కూడా నగదు కొరతకి కారణం.

Posted in Uncategorized

Latest Updates