బ్యాంకులు మూత: మే 30, 31 తేదీల్లో బ్యాంక్‌ ఉద్యోగుల సమ్మె

bank-bandhమే 30, 31 తేదీల్లో దేశవ్యాప్తంగా బ్యాంక్‌ ఉద్యోగులు సమ్మె నిర్వహిస్తున్నట్లు యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్(UFBU) ఏపీ, తెలంగాణ శాఖలు తెలిపాయి. బ్యాంకు ఉద్యోగులకు వేతన సవరణ అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం, ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ సమ్మె నిర్వహించనున్నారు. దీంతో దేశంలోని బ్యాంక్‌లు మూతపడనున్నాయని UFBU కన్వీనర్‌ తెలిపారు. బ్యాంకు ఉద్యోగులకు 2017 నవంబర్‌ నుంచి వేతన సవరణ జరపాల్సి ఉందన్నారు.  ఇప్పటికైనా కేంద్రం స్పందించి ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు.

ఇప్పటివరకు 12సార్లు పలు దఫాలుగా చర్చలు జరిపినా వేతన సవరణ ఒప్పందం అసంపూర్తిగానే మిగిలిపోయిందన్నారు బ్యాంకు ఉద్యోగులు. దీనికి ఖాతాదారులు సహకరించాలని కోరారు.

Posted in Uncategorized

Latest Updates