బ్యాంకుల్లో ఏం జరుగుతుంది : IDBIలో రూ.772 కోట్ల మోసం

idbiరూ.772 కోట్ల మోసం జరిగినట్లు IDBI బ్యాంక్ మంగళవారం(మార్చి 27) రాత్రి ప్రకటించింది. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని ఐదు బ్రాంచీల్లో మోసపూరితమైనా ఖాతాలు, లావాదేవీల ద్వారా రూ.772 కోట్లు తెలిపింది IDBI.

2009 – 13 మధ్యకాలంలో నకిలీ డాక్యుమెంట్లతో  ఫిష్ ఫార్మింగ్ బిజినెస్ కోసం అప్పులు తీసుకుని ఎగ్గొట్టారని బ్యాంక్ వెల్లడించింది. ఆ అప్పులు ఇచ్చే సమయంలో ఇద్దరు అధికారులు నిబంధనలు ఉల్లంఘించారని గుర్తించినట్లు కూడా తెలిపింది బ్యాంక్. వీరిలో ఒకరిని తొలగించాం అని.. మరో అధికారి ఇప్పటికే రిటైర్డ్ అయ్యాడని తెలిపింది. IDBI బ్యాంక్ లో మోసంపై.. CBI కేసు నమోదు చేసింది. దీంతో ఆ బ్యాంక్ షేర్లు భారీగా పడిపోయాయి. ఒక్కో షేరు రూ.4.50పైసలు తగ్గి.. రూ.71.75 దగ్గర ట్రేడ్ అవుతుంది.

Posted in Uncategorized

Latest Updates