బ్యాంకుల్లో డబ్బు చాలా ఉంది : జైట్లీ

ARUN CASHదేశంలో ఎక్కడ చూసిన నో క్యాష్ ATMలపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. దేశంలో ఉన్న కరెన్సీ పరిస్థితిపై సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. ప్రస్తుతం అవసరం కన్నా ఎక్కువ నగదు చెలామణిలో ఉన్నట్లు ట్వీట్ చేశారు. బ్యాంకుల దగ్గర కూడా కావాల్సినంత నగదు ఉందన్నారు. కొన్ని రాష్ర్టాల్లో అనూహ్యంగా డిమాండ్ ఏర్పడటం వల్ల.. పాక్షికంగా నగదు లోటు ఏర్పడినట్లు తెలిపారు.

కరెన్సీ కొరత ఏర్పడిన ప్రాంతాల్లో దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నట్లు జైట్లీ చెప్పారు. నగదు కొరత వల్ల చత్తీస్‌ ఘడ్‌ లో తీవ్ర ప్రభావం ఉన్నట్లు ఆ రాష్ట్ర సీఎం రమణ్ సింగ్ తెలిపారు. వీలైనంత త్వరలో పరిస్థితి మెరుగుపడుతుందని జైట్లీ హామీ ఇచ్చారు.

Posted in Uncategorized

Latest Updates