బ్యాంకుల లిస్టు ఇదే : వడ్డీరేట్లు పెరిగాయి

BANKS INTRESTబ్యాంకులు వడ్డీ రేట్లను పెంచడంలో ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. ఇప్పటికే SBI, ICICI, PNB బ్యంకులు వడ్డీరేట్లను పెంచిన విషయం తెలిసిందే. లేటెస్ట్ గా HDFC, కోటక్ మహీంద్రా, యూనియన్ బ్యాంకులు వడ్డీరేట్లను పెంచాయి. రిజర్వు బ్యాంక్ ద్రవ్య పరపతి సమీక్ష కంటే ముందుగానే బ్యాంకులు వడ్డీరేట్లను పెంచడం విశేషం. ప్రతినెల మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్లపై సమీక్షలో భాగంగా ఈ మూడు సంస్థలు రుణాలపై వడ్డీరేట్లను పది బేసిస్ పాయింట్ల వరకు సవరించాయి.

వీటిలో శనివారం (జూన్) నుంచి అమలులోకి వచ్చేలా HDFC బ్యాంక్ వడ్డీరేటును 0.10 శాతం వరకు పెంచడంతో రుణ రేటు 8.50 శాతానికి చేరుకున్నది. అలాగే యూనియన్ బ్యాంక్ 10 బేసిస్ పాయింట్లు పెంచడంతో వడ్డీరేటు 8.45 శాతానికి, కొటక్ మహీంద్రా ఏకంగా 0.20 శాతం పెంచడంతో 8.9 శాతానికి చేరుకున్నది. త్వరలో మరిన్ని  బ్యాంకులు వడ్డీరేట్లను పెంచి,  వీటి లిస్టులో చేరనున్నట్లు తెలిపాయి బ్యాంకింగ్ వర్గాలు.  బ్యాంకులు తీసుకున్న ఈ నిర్ణయంతో ఖాతాదారుడిపై మరింత భారం పడబోతున్నది.

Posted in Uncategorized

Latest Updates