బ్యాంకు బోర్డు ఆఫ్‌  బ్యూరో చైర్మన్‌గా భాను ప్రతాప్‌

BP SHARMAబ్యాంకు బోర్డు ఆఫ్‌  బ్యూరో (BBB)కి చైర్మన్‌గా  భాను ప్రతాప్‌ శర్మను నియమించింది ప్రభుత్వం.  ప్రస్తుతం BBB మొట్టమొదటి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న వినోద్ రాయ్‌ స్థానంలో  డిపార్ట్‌మెంట్‌ పర్సనల్‌  అండ్‌ ట్రైనింగ్‌  మాజీ డిప్యూటీ కార్యదర్శి భాను ప్రతాప్‌ శర్మను ఎంపిక చేసింది. రెండేళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగనున్నట్లు  ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్యదర్శి రాజీవ్ కుమార్ తెలిపారు.  ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సీనియర్ లెవల్ నియామకాలలో ప్రభుత్వం జోక్యం చేసుకోదనే మాటకుతాము కట్టుబడి ఉన్నామంటూ ఆయన ట్వీట్‌ చేశారు.

వేదికా భండార్కర్ (మాజీ ఎండీ క్రెడిట్ సూయిస్‌ ఇండియా), పి ప్రదీప్ కుమార్ (మాజీ ఎండీ.ఎస్‌బీఐ), ప్రదీప్ పి.షా (వ్యవస్థాపకుడు, ఎండీ క్రిసిల్) BBB లో ఇతర సభ్యులుగా ఉన్నారు.   ప్రభుత్వ రంగ బ్యాంకుల పాలనా వ్యవహారాలను మెరుగుపర్చేందుకు 2016లో ఈ BBBని ప్రభుత్వం ఏర్పాటు  చేసింది.

Posted in Uncategorized

Latest Updates