బ్యాంకు సిబ్బంది దోపిడి : నో డ్యూస్ పేరుతో.. అన్నదాతల నుంచి అక్రమంగా వసూళ్ళు

అన్నదాత అన్ని చోట్ల మోసపోతున్నాడు. క్రాఫ్ లోన్ కోసం నో డ్యూ అని రాసిచ్చేందుకు బ్యాంకుల్లో డబ్బులు డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగులు. ఒక్కొక్కరి నుంచి 90 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా పిండిపోలు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) సిబ్బందిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీరోలు గ్రామానికి చెందిన ఓ రైతు దీనిపై బ్యాంకు సిబ్బందిని నిలదీశాడు. దీంతో బ్యాంకు ఉన్నతాధికారులు రైతుకు సర్దిచెప్పి ప్రయత్నం చేశారు. విషయాన్ని పెద్దది చేయవద్దని కోరారు. ఇదే గ్రామానికి చెందిన కొంతమంది మహిళా రైతులు వస్తే వారి నుంచి 200 రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో గ్రామస్థులంతా బ్యాంకుకు వచ్చి అధికారులను నిలదీశారు. ఐతే తమకు జీఓలపై అవగాహన లేదని చెబుతున్నారు. నో డ్యూ లెటర్ కోసం తీసుకున్న డబ్బును తిరిగి ఇచ్చేస్తామంటున్నారు బ్యాంకు సిబ్బంది.

Posted in Uncategorized

Latest Updates