బ్యాంక్ లను కాపాడు స్వామీ : చిలుకూరులో రుణ విమోచన పూజలు

_Hyderabads-Chilkur-_Temple-holds-prayers-_for-solving-banking-crisis

వర్షాల కోసం, శాంతి కోసం పూజలు, యాగాలు చేయడం తెలుసు. ఇప్పుడు దేశంలో వింత పరిస్థితి నెలకొంది. బ్యాంకులను తినే రాబంధులు తయారయ్యారు. రోజుకొకరు బయటపడుతున్నారు. బ్యాంకులు ఢమాల్ అంటున్నాయి. లక్షల కోట్ల ప్రజల డబ్బును దోపిడీ చేస్తున్నారు. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించాలని కోరుతూ హైదరాబాద్ చిలుకూరు బాలాజీ ఆలయంలో.. రుణ విమోచన పూజలు మొదలుపెట్టారు పూజారులు.

దేశ వ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లోని అప్పులను ఎగ్గొడుతున్న వ్యాపారవేత్తల నుంచి దేశ ప్రజలను విముక్తి చేయాలని చిలుకూరు బాలాజీ టెంపుల్ లో సోమవారం (ఫిబ్రవరి-19) ప్రత్యేక పూజ జరిగింది. దీనికి భక్తులు రుణ విమోచన పూజ అని పేరు పెట్టారు. బ్యాంకుల్లోని ప్రజల సొమ్ము భద్రంగా ఉండాలని మొక్కుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ భక్తులతో ఈ పూజలు చేయించారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లోని కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన క్రమంలో ఈ పూజ నిర్వహించినట్లు చెప్పారు పూజారులు.

దేశంలోని ఎందరో నిరుపేదలు కష్టపడుతున్న డబ్బును బడాబాబులు దోచుకుంటున్నారన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థలు రాజకీయం జోక్యానికి దూరంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ పూజలో పాల్గొన్న భక్తులు రుణ విమోచన నృసింహ స్తోత్రాన్ని పఠించారు.

Posted in Uncategorized

Latest Updates