బ్యాంక్ ల్లోనూ మోసగాళ్లున్నారు : ఆధార్ లింక్ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

bankబ్యాంక్ అకౌంట్లకు ఆధార్‌ లింక్ విషయంపై కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. అకౌంట్లకు ఆధార్ లింక్ చేయడం ద్వారా బ్యాంక్ మోసాలు ఆగవని, బ్యాంక్ మోసాలకు చెక్ పెట్టేందుకు ఆధార్ లింక్ చేయడం పరిష్కార మార్గం కాదని సుప్రీం తెలిపింది. ఆధార్‌ లింక్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. కొంతమంది బ్యాంకర్లు మోసగాళ్లతో చేతులు కలుపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. బ్యాంకులకు ఎవరు మోసగాల్లో తెలుసని సుప్రీంకోర్టు తెలిపింది. పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఇటీవల కాలంలో బయటపడుతున్న భారీ కుంభకోణాల సమయంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి

Posted in Uncategorized

Latest Updates