మరో బ్యాంక్ స్కామ్ : పంజాబ్ సీఎం అల్లుడిపై సీబీఐ కేసు

onfపంజాబ్ సీం అమరీందర్ సింగ్ అల్లుడు గురుపాల్ సింగ్ చిక్కుల్లో పడ్డారు. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ను రూ.109 కోట్ల రూపాయల మోసం చేసిన కేసులో ఆయనపై కేసు నమోదు చేశారు సీబీఐ అధికారులు. బ్యాంకును మోసం చేసిన సింభోలి షుగర్స్‌ లిమిటెడ్‌ కేసులోని 11 మందిలో సీఎం అల్లుడు గురుపాల్ సింగ్ ఒకరు. ఆయన కంపెనీకి డిప్యూటీ డైరెక్టర్ గా ఉన్నారు. ఆదివారం (ఫిబ్రవరి 25) ఈ కంపెనీ డైరెక్టర్ల ఇళ్లలో సీబీఐ సోదాలు నిర్వహించింది.

దేశంలోని అతిపెద్ద షుగర్‌ కంపెనీల్లో పంజాబ్‌కు చెందిన సింభోలి షుగర్స్‌ లిమిటెడ్‌ ఒకటి. దీనికి గుర్మిత్‌ సింగ్‌ మాన్‌ ఛైర్మన్‌. 2011లో ఈ కంపెనీ చెరకు రైతులకు ఫైనాన్స్‌ చేసేందుకు ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ నుంచి రూ.148.60 కోట్ల అప్పు తీసుకుంది. ఈ మొత్తాన్ని రైతులకు అందజేయకుండా కంపెనీ తన అవసరాలకు వాడుకుంది. దీంతో రూ.97.85కోట్లు మొండిబకాయిగా మారింది. మార్చి 2015లో తప్పును గుర్తించినట్లు బ్యాంక్‌ ప్రకటించింది. 2015 మేలో మొండి బకాయిల జాబితాలో చేర్చింది.

ఎన్‌పీఏ(NPA- మొండి బకాయి) తగ్గించుకోవాలని భావించిన బ్యాంక్‌, పాత మొండి బకాయి రూ. 97.85 కోట్లను తీర్చేందుకు సింభోలి షుగర్స్‌కు మరో రూ.110 కోట్లను కార్పొరేట్‌ రుణంగా ఇచ్చింది. ఈ కొత్త అప్పును కూడా సింభోలీ షుగర్స్‌ ఎగ్గొట్టడంతో 2016 నవంబర్‌ 29న ఈ మొత్తాన్ని కూడా ఓరియంటల్ బ్యాంక్ ఎన్‌పీఏగా ప్రకటించింది. దీనిపై 2017 నవంబర్‌ 17న సీబీఐని ఆశ్రయించింది బ్యాంక్. నేరపూరిత కుట్ర, మోసాల నిరోధక చట్టం కింద ఫిబ్రవరి 22న సీబీఐ కేసు నమోదు చేసింది.

Posted in Uncategorized

Latest Updates