బ్యాట్స్ మెన్ రీ ఎంట్రీ : కాంగ్రెస్ లో చేరిన మాజీ సీఎం కిరణ్

కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. ఢిల్లీలో AICC అధ్యక్షుడు రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తిరిగి పార్టీలోకి రావడం సొంతింట్లోకే వచ్చినట్లుందన్నారు కిరణ్. విభజన హామీలను నెరవేర్చటం కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో టీడీపీ, వైసీపీ ఫెయిల్ అయ్యాయన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావాలన్నారు కిరణ్. విభజన సమయంలో ఉద్వేగంతో పార్టీ వీడి వెళ్లిన వారితో మాట్లాడి.. ఏపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామన్నారు.  భావోద్వేగంతోనే కిరణ్ పార్టీకి దూరమయ్యారని, త్వరలో మిగతా వారు కూడా వస్తారని ఏపీ చీఫ్ రఘువీరా రెడ్డి అన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చివరి సీఎంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి, విభజన సమయంలో అధిష్ఠానం నిర్ణయాన్ని వ్యతిరేకించి పార్టీకి రాజీనామా చేశారు. తర్వాత సమైక్యాంధ్ర పార్టీ పెట్టారు. నాలుగేళ్లుగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆయన జూలై 13వ తేదీ శుక్రవారం మళ్లీ కాంగ్రెస్ లో చేరారు. కార్యక్రమంలో ఏపీ వ్యవహారాల ఇంచార్జీ ఊమెన్ చాందీ, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఇతర నేతలు పాల్గొన్నారు.

Posted in Uncategorized

Latest Updates