బ్యాడ్ న్యూస్ : డైరెక్టర్ క్రిష్ ఫ్యామిలీలో విభేదాలు – విడాకులకు అప్లయ్?

director-krish-wifeటాలీవుడ్ లో మరో సంచలనం. అద్భుత చిత్రాల దర్శకుడు క్రిష్ కుటుంబంలో విభేదాలు చర్చనీయాంశం అయ్యాయి. భార్య నుంచి విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. క్రిష్ – రమ్య పరస్పర అంగీకారంతో.. ఇద్దరూ అనుకుని విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు సినీ ఇండస్ట్రీ అంటోంది. కలిసి ఉండలేం అనుకున్నప్పుడు.. కలిసి విడిపోవటం మంచిదని.. అభిప్రాయాలు కలవనప్పుడు విడిపోవటమే బెటర్ అని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. రెండు రోజులుగా ఈ వార్త సోషల్ మీడియాలో ప్రచారంలోకి రావటంతోపాటు.. ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ గుసగుసలు ఎక్కువ అయ్యాయి. చాలా మంది ప్రముకులు కూడా క్రిష్ ను ఇదే అంశంపై ఫోన్ చేసి ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో డైరెక్టర్ క్రిష్ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించి.. ప్రచారానికి తెరదించాలని డిసైడ్ అయ్యారు.

బాలయ్య గౌతమిపుత్ర శాతకర్ణి మూవీ సమయంలోనే డాక్టర్ రమ్యను వివాహం చేసుకున్నారు క్రిష్. ఈ వెంటనే సినిమా షూటింగ్ బిజీలో పడ్డారు. ఆ మూవీ హిట్ తర్వాత.. హిందీలో కంగనారనౌత్ తో మణికర్ణిక ప్రాజెక్ట్ చేపట్టాడు. ఆరు నెలలుగా అదే పనిలో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టాడు. కుటుంబంతో కంటే.. సినిమాల్లోనే బిజీ అయిపోవటంతో భార్య రమ్యతో బేధాభిప్రాయాలు వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఇద్దరూ చర్చించుకుని ఓ నిర్ణయానికి వచ్చి.. విడిపోవాలని అనుకున్నారంట. ఆ క్రమంలోనే విడాకులకు కూడా అప్లయ్ చేసినట్లు తెలుస్తోంది.

Posted in Uncategorized

Latest Updates