బ్యాన్ వాలెంటైన్స్ డే పోస్టర్ రిలీజ్

anti-valentines-day-banned-animated-heartప్రేమికుల రోజును నిషేధించాలి – భారతీయ సంస్కృతిని కాపాడదాం అంటూ ఆదివారం (ఫిబ్రవరి-11) విశాఖలో జన జాగరణ సమితి సభ్యులు బ్యాన్ వ్యాలంటైన్ డే అనే పేరుతో పోస్టర్ ను విడుదల చేశారు. వుడా సెంట్రల్ పార్క్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో జన జాగరణ సమితి రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యులు ప్రేమికులరోజుపై మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి ప్రేమికుల రోజును నిషేధించి.. భారతీయ సంస్క్రతిని కాపాడాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు పేరుతో తాత్కాలికంగా క్లబుల్లో, పబ్బుల్లో, పార్కుల్లో ప్రేమ అంటూ విచ్చలవిడి సెక్స్ కార్యకలాపాలకు పాల్పడటం, డ్రగ్స్ వాడటంవల్ల సనాతన భారతీయ సంస్కృతి, విలువలపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

Posted in Uncategorized

Latest Updates