‘బ్యాలెట్’ కావాలంటూ పసుపు రైతుల ధర్నా

నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికలను బ్యాలెట్ తోనే జరిపించాలని నామినేషన్లు వేసిన పసుపు రైతులు డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. నిజామాబాద్ లో ఎన్నికల ఏర్పా ట్లను పరిశీలిం చడానికి కేంద్ర డిప్యూటీ ఎన్నికల కమిషనర్ సుదీప్ జైన్, ఇతర కేంద్ర, రాష్ట్ర ఎన్నికల అధికారులు అడిషనల్ సీఈఓ బుద్ధ ప్రకాశ్ తో కలిసి బుధవారం నిజామాబాద్ కు వచ్చారు. ఈ సందర్భం గా రైతులు కొద్దిసేపు ధర్నాకు దిగారు. నిజామాబాద్ సీపీ కార్తికేయ రైతులతో మాట్లాడారు. ఎన్నికల అధికారులతో తమను మాట్లాడిం చాలని రైతులు సీపీని కోరారు. కొద్దిసేపు సీపీ కార్తికేయ, ఇతర జిల్లా అధికారులతో రైతులు వాగ్వా దానికి దిగారు. జిల్లా కలెక్టర్ ఎం.రామ్మోహన్ రావు తమను ఎంపీ అభ్యర్థులుగా గుర్తించకుండా చిన్నచూపు చూస్తున్నారని,సమస్యను తెలపడానికి వస్తే తమతో మాట్లాడటంలేదని పసుపు రైతులు ఆరోపించారు. ఎన్నికల అధికారిని కలిసే అవకాశమివ్వా లని, తమ ఆవేదనను వారితోనే చెప్పుకుంటా మని అన్నారు. ఎన్నికల అధికారులు ఫంక్షన్ హాల్​లో ఏర్పాట్లు పరిశీలిస్తున్నంత సేపు గొడవ పెద్దది కాకుండా సీపీ కార్తికేయ, ఇతర అధికారులు రైతులను సముదాయించారు.

Latest Updates