బ్యూటీపార్లర్లే టార్గెట్ : ఈ మాయలేడీని పట్టిస్తే భారీ బహుమతి

BEAUTYఓ మహిళా దొంగ కోసం రూ.25 వేల నజరానాను ప్రకటించారు హైదరాబాద్ లోని కూకట్ పల్లి పోలీసులు. కొన్ని రోజులుగా KPHB ప్రాంతాల్లోని బ్యూటీ పార్లర్లలో వరుసగా జరుగుతున్న దొంగతనాలపై ఆరా తీసిన పోలీసులు.. CCTV పుటేజీ ఆధారంగా ఓ మాయలేడీ ఈ దొంగతనాలను చేస్తున్నట్లు గుర్తించారు. బ్యూటీ పార్లర్ లో మేకప్ కోసమని వచ్చి చోరీలకు పాల్పడుతున్నట్లు నిర్ధారించారు. అనుమానాస్పద మహళలతో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

కొన్ని రోజుల్లోనే కూకట్ పల్లి, KPHB పోలీస్‌ స్టేషన్ల పరిధిలో రెండు బ్యూటీ పార్లర్లలో మేకప్‌ చేయించుకునేందుకు వెళ్లింది. ఆ తర్వాత అక్కడున్న వారికి మత్తు మందు ఇచ్చి.. నగలతో ఉడాయించింది. సీసీటీవీ ఆధారంగా ఫొటోలు విడుదల చేసిన పోలీసులు.. ఆ మాయలేడి వివరాలు తెలిపినవారికి రూ.25వేల బహుమతి ప్రకటించారు పోలీసులు.

ఈ మాయలేడీ, మరో మహిళతో కలిసి.. KPHB కాలనీ 6వ ఫేజ్‌ లో మే 19న మాధురి బ్యూటీ పార్లర్‌ లో మేకప్‌ చేయించుకున్నది. ఒంటిపై ఉన్న బంగారాన్ని తొలగించి.. మేకప్‌ చేయాలని కోరింది. కస్టమర్ కోరిక మేరకు.. నిర్వాహకురాలు బంగారాన్ని తీసి పక్కన పెట్టింది. యజమానిని మాటల్లో పెట్టింది. ఈలోపు ఈ మాయలేడీ వెంట వెళ్లిన మరో మహిళ మత్తు బిల్లలను యజమానికి ఇచ్చి.. ఆమె నగలతో పరారీ అయ్యారు. ఇదే విధంగా.. నిజాంపేట రోడ్డులోని ఓ బ్యూటీ పార్లర్‌ లోనే దోపిడీ చేశారు. KPHB పోలీసు స్టేషన్‌ పరిధిలో ఈ తరహా ఘటనలు పునరావృతమవడంతో పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. ఆ మహిళను పట్టుకునేందుకు ప్రజల నుంచి సమాచారం పొందేలా.. ఆచూకీ తెలిపినవారికి ఈ పారితోషికం ప్రకటించినట్లు చెప్పారు పోలీసులు.

Posted in Uncategorized

Latest Updates