బ్యూటీషియన్‌ అనుమానాస్పద మృతి

ladiహైదరాబాద్ నగరంలోని లింగంపల్లిలో గ్రీన్ ట్రెండ్స్‌లో బ్యూటీషియన్‌ గా పనిచేస్తున్న జ్యోతి అనే యువతి వికారాబాద్‌లో శవమై తేలింది. తాండూరులోని అమ్మమ్మ వాళ్లింటికి జాతరకని ఇంట్లో చెప్పి బయలుదేరిని అమ్మాయి దారుర్ మండలం తరిగోపుల రైల్వే స్టేషన్ లో ఆదివారం (ఏప్రిల్-15) రాత్రి 11 గంటల ప్రాంతంలో బీజాపూర్ రైలు నుంచి కిందపడిపోయింది.

సోమవారం (ఏప్రిల్-16) ఉదయం  వరకు కొన ఊపిరితో ఉన్న యువతిని గుర్తించిన రైల్వే సిబ్బంది ఆస్పత్రికి తరలించే లోపు మృతి చెందింది. మృతురాలి స్వస్థలం యాలాల్ మండలం పగిడాల్ గ్రామం. తల్లి కాశమ్మ, తండ్రి మల్లికార్జున్ లతో కలిసి తాండూర్ లో నివాసం ఉంటుంది. జాతరకని బయలుదేరి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. యువతి ఫోన్ మైలారం సమీపంలో దొరికినట్లు సమాచారం. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని హత్యానా…, ఆత్మహత్యానా.. రైలు నుంచి పడిపోయిందా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

 

 

Posted in Uncategorized

Latest Updates