బ్రాండ్ అంబాసిడర్ గా ఐదేళ్ల బాలుడు

nehalరాష్ట్ర నీటిపారుదల శాఖకు బ్రాండ్ అంబాసిడర్ ను నియమించారు మంత్రి హరీష్ రావు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందిళ్లపల్లికి చెందిన నేహాల్…. తల్లిదండ్రులతో కలిసి మంత్రి హరీష్ ను కలిశారు. UKG చదువుతున్న నెహాల్ రాష్ట్ర నీటిపారుదల ప్రాజెక్టులు, రీడిజైనింగ్ పై సీఎం చేసిన సూచనలను అలవోకగా చెప్పగలడు. ఎంతో అనుభవం ఉన్న ఇంజినీర్లు కూడా గుర్తుపెట్టుకోని సమాచారాన్ని…ఈజీగా చెప్పేస్తున్నాడు. దీంతో ఐదేళ్ల బాలుడు నేహాల్ ప్రతిభను చూసి ఆశ్యర్యపోయిన హరీశ్ రావు అభినందించారు.

ఖమ్మం జిల్లాకు చెందిన హనుమంతరావు… హైదరాబాద్ షాపూర్ నగర్లో ఒక ప్రైవేట్ కంపెనీలో చిరుద్యోగి. కొడుకు నేహాల్ ప్రాజెక్టుల గురించి అనర్గలంగా మాట్లాడుతుండటంతో…..స్థానిక నేతల సాయంతో మంత్రి దగ్గరకు తీసుకొచ్చాడు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ను తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డ పాయింట్ కు ఎందుకు మార్చారో…మహారాష్ట్ర అభ్యంతరాలను క్లారిటీగా చెప్పాడు నేహాల్. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ సహా రాష్ట్రంలోని ఇతర ప్రాజెక్టులపై మంత్రి ముందు తన జ్ఞాపశక్తిని ప్రదర్శించాడు.

నేహాల్ ప్రతిభను చూసిన హరీష్… చదువుకు అయ్యే ఖర్చు అంతా నీటిపారుదల శాఖ భరిస్తుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ను కలవాలని ఉందని చిన్నారి నేహాల్ తన కోరికను…మంత్రి హరీశ్ రావుకు చెప్పాడు. మరోవైపు నేహాల్ తో పాటు అతని కుటుంబ సభ్యులను కాళేశ్వరం ప్రాజెక్ట్ కు తీసుకువెళ్లి చూపించాలని CE హరిరామ్ ను ఆదేశించారు మంత్రి. నెహాల్ కు గొప్ప భవిష్యత్ ఉందని ఆశీర్వదించారు.

Posted in Uncategorized

Latest Updates