బ్రాండ్ వ్యాల్యూ : స్టాక్ మార్కెట్ లో హైదరాబాద్ సిటీ

brand
హైదరాబాద్ మహా నగరం స్టాక్ మార్కెట్ లోకి ఎంటర్ అయ్యింది. ఇక నుంచి హైదరాబాద్ సిటీ వ్యాల్యూ ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతుంది. అవును మీరు విన్నది నిజమే. హైదరాబాద్ సిటీ ఇప్పుడు BSE (బాంబే స్టాక్ మార్కెట్) లిస్ట్ అయ్యింది. GHMC ఆధ్వర్యంలో లాంఛనంగా ఫిబ్రవరి 22వ తేదీ గురువారం ఉదయం లిస్టింగ్ అయ్యింది. స్టాక్ ఎక్స్చేంజ్ అధికారులతోపాటు SBI బ్యాంక్, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు తరలివచ్చారు. స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన రెండో నగరంగా హైదరాబాద్ ఖ్యాతి గాంచింది. ఇప్పటికే పూణె ఈ బిజాతాలో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. లిస్టింగ్ కంటే ముందే.. ఎలక్ట్రానిక్ బిడ్డింగ్ ద్వారా రూ.200 కోట్ల నిధుల సమీకరణకు బిడ్డింగ్ వేసింది GHMC. అనూహ్యంగా రూ.400 కోట్లపైనే బిడ్డర్లు ముందుకు వచ్చారు. తొలి దశలో రూ.200 కోట్ల నిధులు ఇప్పటికే జీహెచ్ఎంసీ ఖాతాలో జమ అయ్యాయి. అవసరాన్ని బట్టి రెండో విడతలో మిగతా డబ్బును కూడా తీసుకుంటోంది.

ఈ డబ్బుతో జీహెచ్ఎంసీ ఏం చేస్తోంది :

ఇప్పటికే సేకరించిన రూ.200 కోట్ల నిధులతో వ్యూహాత్మక రహదారుల పథకం కింద హైదరాబాద్ సిటీని మార్చనున్నారు. సిటీలో రవాణా వ్యవస్థను ఆధునీకరించనున్నారు. ఫ్లైఓవర్లు నిర్మించనున్నారు. మెరుగైన రవాణా వ్యవస్థను అభివృద్ధి చేస్తారు. అభివృద్ధితో పరిశ్రమలు వస్తాయి. శివారు ప్రాంతాలు విస్తరిస్తాయి. వీటి ద్వారా వచ్చే ఆదాయంతో స్టాక్ మార్కెట్ లో హైదరాబాద్ బాండ్ విలువ పెరుగుతుంది. ఇప్పటికే హైదరాబాద్ సిటీకి టాప్ రేటింగ్ ఇచ్చాయి. దీంతో స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ కావటం ఈజీ అయ్యింది. మొత్తం వెయ్యి కోట్ల నిధుల సమీకరణ చేయాలని నిర్ణయించారు. మొదటి విడతగా రూ.200 కోట్లు తీసుకున్నారు.

Posted in Uncategorized

Latest Updates