బ్రిక్ సమ్మిట్-2018 : ఆఫ్రికా దేశాల అభివృద్ది, శాంతి కోసం కృషి చేస్తున్నామన్న మోడీ

ఆఫ్రికా దేశాలతో భారత్ కు ఎప్పటినుంచో సంబంధాలు ఉన్నాయన్నారు ప్రధాని నరేంద్రమోడీ. సౌతాఫ్రికాలోని జోహన్నస్ బర్గ్ లో జరుగుతున్న 10వ బ్రిక్స్ సమావేశంలో మోడీ మాట్లాడారు. నాలుగేళ్లగా తమ ప్రభుత్వం ఆప్రికన్ కంట్రీస్ లో డెవలప్ మెంట్, శాంతి కోసం కృషి చేస్తుందని మోడీ తెలిపారు. ఆఫ్రికాలోని 40కి పైగా దేశాలకు 11 బిలియన్ డాలర్లు ఆర్ధికసాయం చేసినట్లు మోడీ తెలిపారు. ఆప్రికన్ దేశాల్లోని ప్రైవేట్ సెక్టార్ లో ఇండియా 54 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టిందని మోడీ తెలిపారు. డిజిటల్ విప్లవం అందరికీ కొత్త అవకాశాలు తీసుకొస్తుందని మోడీ తెలిపారు. చాలామంది ఆఫ్రికా విద్యార్ధులు స్టడీస్ కోసం భారత్ కు వస్తున్నారని, వాళ్లకు స్కాలర్ షిప్ లు కూడా ఇస్తున్నామని మోడీ తెలిపారు.ఈ సదస్సు సందర్భంగా అనేకమంది ఆఫ్రికన్ లీడర్లు కలిసికట్టుగా రావడం ఓ అద్భుతమని మోడీ తెలిపారు. ఆఫ్రికా దేశాలతో సత్సంబంధాల కోసం భారత్ 10 నియమాలను పాటిస్తోందని మూడు రోజుల క్రితం ఉగండా పార్లమెంట్ లో చెప్పానని మోడీ తెలిపారు. అంతకుముందు రష్యా అధ్యక్షుడితో మోడీ సమావేశమయ్యారు. వివిధ దేశాల అధినేతలతో కలసి ఫోటోలు దిగారు ప్రధాని మోడీ.

Posted in Uncategorized

Latest Updates