బ్రిక్ సమ్మిట్-2018 : నాలుగో పారిశ్రామిక విప్లవంపై చర్చించిన దేశాధినేతలు

సౌతాఫ్రికా జొహన్స్ బర్గ్ లో పదవ బ్రిక్స్ సదస్సు ప్రారంభమైంది. మూడురోజుల పాటు జరిగే ఈ సదస్సులో తొలిరోజు బ్రిక్స్ నాలుగో పారిశ్రామిక విప్లవంపై చర్చించారు దేశాధినేతలు. ఉత్తమ సేవలు, విధానాలు, టెక్నాలజీ ఆవశ్యకత, వివిధ గ్లోబల్ ఇష్యూస్ పై బ్రిక్స్ దేశాధినేతలతో పంచుకున్నారు భారత ప్రధాని మోడీ. పారిశ్రామిక ఉత్పత్తి, తయారీ, రూపకల్పనలో విప్లవాత్మక మార్పులొస్తున్నాయని.. దానికి తగ్గట్టు హై స్కిల్డ్ లేబర్ ని తయారుచేసుకోవాలన్నారు. రాబోయే తరాలను ప్రపంచ మానవ వనరులుగా మార్చేందుకు భారత్ లో సిలబస్-యూనివర్సిటీలను సంస్కరిస్తున్నామన్నారు. ఇక చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్… వాణిజ్యంలో ఎవరూ విజేతలు కారని… ఎవరి అవకాశాలు వాళ్లకుంటాయన్నారు. స్వేచ్ఛా వాణిజ్యానికి అన్ని దేశాలు కృషి చేయాలన్నారు. అంతకుముందు ఈ ఏడాది బ్రిక్స్ సదస్సుకు ఆతిధ్యమిస్తున్న సౌతాఫ్రికా దేశ అధ్యక్షుడు క్రిల్ రమపోసాతో మోడీ సమావేశమయ్యారు.

Posted in Uncategorized

Latest Updates