బ్రిటన్ ప్రజలు నల్లగా ఉండేవారట

britanతెల్లగా అందంగా ఉండే బ్రిటన్‌వాసులు మొదట్లో నీలి కళ్లతో నల్లగా ఉండేవారట. సౌత్ వెస్ట్ ఇంగ్లండ్‌లోని ఓ గుహలో 1903లో బయటపడిన 10,000 సంవత్సరాల నాటి వ్యక్తి అస్థిపంజర అవశేషాలకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించిన అనంతరం పరిశోధకులు ఈ విషయాన్ని తెలిపారు.  బ్రిటన్‌ నేచురల్‌ హిస్టరీ మ్యూజియం, యూనివర్సిటీ కాలేజీ లండన్‌ నిపుణులు ఈ అధ్యయనం చేశారు. పుర్రెకు 2 మీ.మీ. రంధ్రంచేసి ఎముక చూర్ణాన్ని సేకరించి దీనికి డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించారు. దీంతో బ్రిటన్‌వాసులు గోధుమ వర్ణపు కళ్లతో తెల్లగా ఉండేవారన్న భావనకు విరుద్ధమైన ఫలితాలు వెలుగులోకి వచ్చాయి. ‘‘తాజా ఫలితాలుచూసి ఆశ్చర్యానికి గురయ్యాం. ఉత్తర ఐరోపా వాసులకు తెల్లని మేనిఛాయ మనం ముందుకు ఊహించిన దానికంటే ఆలస్యంగా వచ్చింది. అంటే చాలాఏళ్లు వీరు నల్లగానే గడిపారు’అని పరిశోధన గ్రూప్ లోని క్రిస్‌ స్ట్రింజెర్‌ తెలిపారు.

 

 

 

Posted in Uncategorized

Latest Updates