బ్రిటన్ రాకుమారుడి పెళ్లికి ముంబైలో షాపింగ్

harry-and-markleబ్రిటన్‌ రాకుమారుడు హ్యారి, రాకుమారి మెఘాన్‌ మార్కల్‌ గురువారం ముంబైలో షాపింగ్‌ చేశారు. అయితే ముంబైకి చెందిన డబ్బావాలాలు నేతృత్వంలో వారు పెళ్లికి సంబంధించిన షాపింగ్‌ చేశారు. బ్రిటన్‌ రాకుమారిడి కుటుంబానికి, డబ్బావాలా వారికి అనుబంధం 2003లోనే మొదలైంది. ప్రిన్స్‌ చార్లెస్‌ తొలిసారిగా 2003లో ముంబైకి వచ్చారు. అప్పుడు వారి పనితనాన్ని, పని పట్ల వారికి ఉన్న నిబద్ధతను చూసి ముగ్దుడైపోయారు. 2005లో జరిగిన చార్లెస్‌, కెమిల్లా పార్కర్‌ వివాహానికి హాజరు కావల్సిందిగా డబ్బావాలాలను ఆహ్వానించారు.

ప్రస్తుతం హ్యారి పెళ్లి షాపింగ్‌కు ఈ డబ్బావాలాలు కూడా హాజరయ్యారు. సంప్రదాయ దుస్తులైన కుర్తా పైజామా, పెళ్లి చీరలు, మంగళసూత్రం, ఆకుపచ్చ గ్లాస్‌ గాజులను రాకుమారుడి దంపతులకు బహూకరించారు ముంబై డబ్బావాలాలు. ఈ పెళ్లి సందర్భంగా ముంబైలోని ప్రభుత్వాసుపత్రిల్లో స్వీట్లు పంచుతామని డబ్బావాలాలు చెప్పారు. 33 ఏళ్ల హ్యారి, 36 ఏళ్ల మార్కల్‌ను శనివారం(మే 19న) వివాహం చేసుకోబోతున్నారు.

Posted in Uncategorized

Latest Updates