బ్రోకర్లతోనే కాంగ్రెస్ రక్షణశాఖను నడిపింది : నిర్మలా సీతారామన్

రాఫెల్ డీల్ కి సంబంధించి కాంగ్రెస్‌ ఆరోపణలపై ఘాటుగా స్పందించారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి  నిర్మలా సీతారామన్. ‘నిరాశా, నిస్పృహలకు గురయినప్పుడల్లా ఆరోపణలు చేయడం కాంగ్రెస్‌ కు అలవాటైపోయిందని ఆమె అన్నారు. రాఫెల్ డీల్‌ ‌ను కుదుర్చుకోలేకపోవడం, సోమ్ముచేసుకోలేకపోవడం వల్లే కాంగ్రెస్ అవిశ్రాంతంగా,  రాఫెల్ డీల్ కుదుర్చుకొన్న తమపై విమర్శలు చేస్తోందని అన్నారు. రక్షణ శాఖను కాంగ్రెస్ కేవలం బోకర్ల, దళారుల సాయంతో నడిపి ఉంటారని….రక్షణ దళాలకు అవసరమైన ముఖ్యమైన ఎక్యూప్మెంట్ ని కొనుగోలు చేయలేదని నిర్మలా సీతారమన్ అన్నారు. అయితే బ్రోకర్ల సాయం లేకుండానే ఒప్పందం కుదుర్చుకోవడం సాధ్యమని ఎన్డీయే ప్రభుత్వం నిరూపించిందన్నారు. యూపీఏ హయాంలో HAL తో ఎలాంటి అగ్రిమెంట్ కుదుర్చుకోలేదని నిర్మలా సీతారామన్ అన్నారు. కాంగ్రెస్ నేతలు నిజాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారని, అవినీతి ఎక్కడ జరిగిందా అని వెతుకుతుంటారని, అయితే తమ ప్రభుత్వంలో అవినీతికి చోటులేదని నిర్మలాసీతారామన్ అన్నారు.

 

Posted in Uncategorized

Latest Updates