భక్తులతో కిటకిటలాడిన యాదాద్రి

యాదాద్రి : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం గత నాలుగు రోజుల నుంచి భక్తులతో కిటకిటలాడింది. శనివారం నుంచి మంగళవారం వరకు వరుస సెలవులు రావడంతో రాష్ట్ర నలుమూలల నుంచి తండోపతండాలుగా భక్తులు క్షేత్ర సందర్శనకు వచ్చారు. దేవదేవుడిని దర్శించుకొని ఆర్జిత సేవోత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో బారులుతీరారు. భక్తల సంచారంతో ఆలయ మండపాలు సైతం కోలాహలంగా మారాయి. వేకువజామునే పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు దర్శనాలకోసం బారులుతీరారు. దీంతో ఉభయ దర్శన క్యూలైన్లు భక్తులతో నిండి కిటికిటలాడాయి. ధర్మదర్శనాల్లో నాలుగు గంటల సమయం, ప్రత్యేక దర్శనాల్లో రెండు గంటల సమయం పట్టిందని చెప్పారు భక్తులు. స్వామివారికి మంగళవారం ప్రత్యేక దర్శనాల ద్వారా రూ.6,34,000 ఆదాయం వచ్చింది. దీంతో ప్రసాద విక్రయం ద్వారా రూ.10,12,520 ఆదాయం దేవస్థాన ఖజానాకు చేకూరిందని చెప్పారు ఆలయ అధికారులు.

Posted in Uncategorized

Latest Updates