భక్తులతో కిటకిటలాడుతున్న శైవ క్షేత్రాలు

AAమహాశివరాత్రి సందర్భంగా మంగళవారం (ఫిబ్రవరి-13) శైవ క్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి.  విద్యుద్దీప కాంతుల్లో శివాలయాలు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. తెల్లవారజాము నుంచే పుణ్య క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివనామ స్మరణ.. ఓంకార శబ్దాలతో మార్మోగుతున్నాయి.  వేములవాడ రాజన్న సన్నిధిలో మహాశివరాత్రి పర్వదిన వేడుకలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి.  ఉదయం నుంచే భక్తులు పెద్దెత్తున తరలివస్తున్నారు. పరమశివుని అనుగ్రహం కోసం క్యూ లైన్లో బారులు తీరారు.  శివరాత్రి మహోత్సవాల కోసం  అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

జయశంకర్ భుపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర క్షేత్రం మహాశివరాత్రి వేడుకలు వైభవంగా ప్రారంభమైయ్యాయి. వేడుకల్లో భాగంగా మంగళ వాయిద్యాలతో దీపారాధన, గణపతి పూజా స్వస్తి పుణ్యహవచనం, దీక్షా వస్త్రధారణ నిర్వహించారు. వరంగల్‌ లోని వేయి స్థంభాల ఆలయంలో మహశివరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌  ప్రారంభించారు. ఆనంతరం రుద్రేశ్వరున్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అటు శివరాత్రి పర్వదినాన భోళాశంకరున్ని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో నగరవాసులు వెయ్యి స్థంభాల గుడికి చేరుకుంటున్నారు. అటు మెదక్ జిల్లా ఏడుపాయలలోనూ శివరాత్రి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి.  రాష్ట్రవ్యాప్తంగా మహాశివరాత్రి మహోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి.

 

 

Posted in Uncategorized

Latest Updates