భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల కొండలు

తిరుమల కొండలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి, ద్వాదశి పర్వదినం సందర్భంగా శ్రీవారి దర్శనానికి భక్తులు తిరుమలకు ఇప్పటికే  పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మరోవైపు.. వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు TTD అన్ని ఏర్పాట్లను పూర్తిచేసింది. ఈ క్రమంలో అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని ఉత్తర ద్వారం నుంచి దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు.  సోమవారం ఉదయానికే లక్షలాది భక్తులు తిరుమలకు చేరుకున్నారు.

ఇవాళ అర్థరాత్రి 12.05 గంటల తర్వాత శ్రీవారి వైకుంఠ ద్వారాలు తెరచుకోనుండగా, భక్తులకు 48 గంటల పాటు ఉత్తర ద్వార దర్శనాన్ని కల్పించనున్నట్లు TTD ఆలయాధికారులు తెలిపారు. ఇవాళ (మంగళవారం) ఉదయం 9 గంటలకు స్వామివారు స్వర్ణరథంపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఏకాదశి తరువాత ద్వాదశి ఘడియలు ముగిసేంత వరకూ తిరుమల గర్భగుడి చుట్టూ ఉండే వైకుంఠ ద్వారాలు తెరచే ఉండనున్నాయి.

భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలు వస్తుండటంతో అధికారులు నారాయణ గిరి ఉద్యానవనంలో తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేశారు. అయితే పెథాయ్ తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా చలి తీవ్రత పెరిగిపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

 

Latest Updates