భక్తులపైకి దూస్కెళ్లిన లారీ..11మంది మృతి

lorryఉత్తరాఖండ్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది మరణించగా… 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. బరేలి జిల్లాకు చెందిన భక్తులు పూర్ణగిరి దైవదర్శనం కోసం కాలినడకన వెళ్తుండగా… తనక్ పూర్ లోని ఐటీ కార్యాలయం సమీపంలో అతి వేగంగా వచ్చిన లారీ వీరిపై నుంచి దూసుకెళ్లింది. ఈ సంఘటనలో 9మంది అక్కడికక్కడే మృతి చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు భక్తులు మరణించారు. మరో 20 మంది తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.

Posted in Uncategorized

Latest Updates