భద్రతా బలగాల చేతిలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ షోహన్ డి షిరా హతం

badraమేఘూలయ మోస్ట్ వాంటెడ్ టెరర్రిస్ట్ షోహన్ డి షిరా ను భద్రతా దళాలు ఈ రోజు(ఫిబ్రవరి24) ఎన్ కౌంటర్ లో హతమార్చారు. ఫిబ్రవరి 27న మోఘలయాలో ఎన్నికలు జరగనున్న సమయంలో బంగ్లాదేశ్ సరిహద్దులోని గారో హిల్స్ ప్రాంతంలో గారో నేషనల్ లిబరేషన్ ఆర్మీ(GNLA) టెర్రరిస్టులు ఎన్నికలలో పాల్గొనవద్దంటూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ గ్రూప్ కు తనను తాను నాయకుడిగా ప్రకటించుకున్న వాడే ఈ షోహన్ డి షిరా. గత ఆదివారం(ఫిబ్రవరి18) న మేఘాలయ రాజధాని షిల్లాంగ్ కు 320 కిలోమీటర్లున్న గారో హిల్స్ ప్రాంతంలో ఎలక్షన్ క్యాంపెయిన్ లో పాల్గొని తిరిగి వెళ్తున్న సమయంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి జోనతోన్ టెర్రరిస్టులు అమర్చిన బాంబు పేలడంతో మరణించారు. ఆయనతో పాటు సెక్యూరిటీ సిబ్బంది, మరో ఇద్దరు పార్టీ కార్యకర్తలు కూడా చనిపోయారు. దీంతో అప్రమత్తమైన భద్రతా దళాలు ఈ రోజు ఉదయం ఆ టెర్రరిస్ట్ గ్రూపు నాయకుడు షోహన్ డి షిరా ను ఎన్ కౌంటర్ లో హతమార్చారు.

Posted in Uncategorized

Latest Updates