భద్రాచలంలో పెరిగిన గోదావరి నీటి మట్టం

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. గోదావరి నీటి మట్టం అంతకంతకు పెరుగుతోంది. భద్రాచలంలో నిన్న ఉదయం 26 అడుగులు ఉన్న గోదావరి నీటి మట్టం.. ఇవాళ ఉదయానికి 30అడగులకు చేరింది. సాయంత్రం వరకు మరో మూడు నాలుగు అడగులు పెరిగే అవకాశం ఉందంటున్నారు అధికారులు. గోదావరికి ఒక్కసారిగా వరద నీరు వచ్చి చేరడంతో.. రెండవ బ్రిడ్జి నిర్మాణ పనులు నిలిచిపోయాయి. తాలిపేరు ప్రాజెక్టుకు కూడా వరద నీరు పోటెత్తుతోంది. దాంతో 3గేట్లు ఎత్తి ….3వేల 144 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

Posted in Uncategorized

Latest Updates