భద్రాద్రికి వైకుంఠ శోభ

భద్రాచలం: పావన గౌతమీ నదీ తీరంలో వెలసిన భద్రాచల శ్రీరామ దివ్యక్షేత్రం వైకుంఠ ఏకాదశి (ముక్కోటి ఏకాదశి) శోభను సంతరించుకుంది. గోదావరిలో హంస రూపంలో అలంకరించిన తెప్పపై శ్రీసీతారామచంద్రస్వామి విహరిస్తుంటే వీక్షించిన కనులకు పండుగే. ఈ సమయంలో రామనామాన్ని స్మరిస్తే ఎంతో పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. అందుకే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు 17వ తేదీ మధ్యాహ్నానికే భద్రాచలం చేరుకుంటారు.

1971లోఈ ఉత్సవానికి ఆనాటి పాలకమండలి చైర్మన్‌ అల్లూరి మూర్తిరాజు శ్రీకారం చుట్టారు. 47 ఏళ్లుగా ఈ ఉత్సవం జరుగుతోం ది. హైదరాబాద్‌ నుంచి సిబ్బందిని పిలిపించి ఆనాడు హంస రూపంలో లాం చీని సిద్ధం చేసేవారు. రూ.20వేలు ఖర్చు వచ్చేది. ప్రస్తుతం రూ.6లక్షలు వెచ్చిస్తున్నారు. రాష్ట్రంలో తొలిసారిగా భద్రాచలంలోనే తెప్పోత్సవాన్ని నిర్వహించారు. విజయవాడ, అన్నవరం, శ్రీశైలం, సింహాచలం దేవస్థానాలు కూడా భద్రాచలం నుంచే తెప్పను తీసుకెళ్లి ఉత్సవాలు నిర్వహించేవి. కాలక్రమంలో రవాణా చార్జీలు పెరిగి ఆ దేవస్థానాలే స్వయంగా తెప్పను తయారు చేయించి ఉత్సవాలను నిర్వహించుకుంటున్నాయి.

భద్రాచలం వద్ద ఇవాళ(సోమవారం) రాత్రి స్వామి వారి తెప్పోత్సవానికి సర్వం సిద్ధం చేశారు. భక్తరామదాసు కాలం నుంచే తెప్పోత్సవం ఉంది. ఆ రోజుల్లో చిన్న చిన్న పడవలపైనే నిర్వహించే వాళ్లు. 1971 నుంచి మాత్రం పూర్తిస్థాయిలో హంస రూపంలో అలంకరించిన తెప్పపై ఉత్సవాన్ని వేడుకగా ప్రారంభించారు. ముక్కోటి దేవతలు కొలువై… వైకుంఠ ఉత్తరద్వార దర్శనం కోసం భక్తు లు ఆరాటపడుతుంటారు. చతుర్మాస వ్రతం అనంతరం యోగనిద్ర నుంచి మేల్కొని శ్రీవైకుంఠంలో ఉత్తరద్వారంలో దర్శనమిచ్చిన శ్రీమన్నారాయణుడు… భద్రాచలంలో రేపు(మంగళవారం) తెల్లవారు జామున భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. భక్తరామదాసు శ్రీరంగంలో ఈ వైభవాన్ని చూసి భద్రాచలంలోనూ ఈ ఉత్సవాన్ని వందల ఏళ్ల క్రితమే ప్రవేశపెట్టారు.

Posted in Uncategorized

Latest Updates