భధ్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెరుగుతున్న అటవీ జంతువుల వేట

KOTTAభధ్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అటవీ జంతువుల వేట పెరుగుతోంది. గిరిజనులకు డబ్బు ఆశచూపి వేటను ప్రోత్సహిస్తున్నారు కొందరు వ్యక్తులు. అడవి జంతువుల మాంసాన్ని కిలో వేల రూపాయలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. వేట ఇంతస్థాయిలో పెరగడానికి కారణమేమిటని అధికారులు ఆరా తీస్తే నమ్మలేని నిజాలు బయటపడ్డాయి
మూఢ నమ్మకాలు అడవి జంతువుల పాలిట శాపంగా మారాయి. భద్రాద్రికొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో మూఢనమ్మకాలతో అటవీ జంతువులను వేటాడుతున్నారు. గిరిజనులే వేటాడుతున్నా … వెనకుండి చేయిస్తున్నది ఎవరో తెలియని పరిస్థితి. వారం రోజుల్లోనే వేర్వేరు కేసులలో నలుగురు వేటగాళ్లను అరెస్ట్ చేశారు ఫారెస్ట్ ఆఫీసర్లు. దమ్మపేట మండలంలోని వెంకటాద్రిపురంలో… అడవి గొర్రెను చంపి మాంసాన్ని తీసుకుని పారిపోతుండగా… అటవీశాఖ అధికారులు వెంబడించి వారిని పట్టుకున్నారు. అయితే అన్ని కేసులలోనూ అటవీ శాఖ అధికారులకు పట్టుబడింది గిరిజనులే.
గతంలో అటవీ జంతువులను మాంసం కోసం వేటాడేవాళ్లు. కొండ గొర్రెలు, జింకలు, దుప్పులు, కుందేళ్లు, పక్షుల మాంసం రుచిగా ఉంటుందని… వేటాడేవాళ్లు. అయితే ఇంత తరచుగా వేట ఉండేది కాదు. కానీ ఈ మధ్య… వేట కేసులు ఎక్కువయ్యాయి. ఇలా ఎందుకని ఆరా తీస్తే… మూఢ నమ్మకాలని తేలింది. కొండ గొర్రెలు, కనుజు మాంసం తింటే దీర్ఘ కాలిక రోగాలు తగ్గడంతో పాటు, ఇతర ఆరోగ్య సమస్యలు రావనే నమ్మకం కొందరిలో ఉంది. అందుకే వారు గిరిజనులకు డబ్బులిచ్చి వేటను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కొండ గొర్రె మాంసం కిలో 4వేల నుంచి 6వేల వరకు పలుకుతున్నట్టు తెలుస్తోంది. ఫారెస్ట్ అధికారులు అరెస్ట్ లు, దాడులు చేస్తున్నా. మూగ జీవాల వేట ఆగడంలేదు. గిరిజనుల్లో అవగాహన కలిగించడమే సమస్యకు పరిష్కారమంటున్నారు జంతు ప్రేమికులు.

Posted in Uncategorized

Latest Updates