భయపెడుతున్న ఆటోమేషన్ : లక్షల ఉద్యోగాలు మాయం

robo-worksఆటోమేషన్.. ప్రపంచంలోని ఉద్యోగులను భయపెడుతున్న పదం ఇది. రాబోయే నాలుగు, ఐదేళ్లల్లో వివిధ రంగాల్లో పూర్తిస్థాయిలో రాబోతున్న ఆటోమేషన్ వల్ల.. ఇప్పుడు ఉన్న లక్షల ఉద్యోగాలు గల్లంతు అయ్యే అవకాశం ఉందని చెబుతోంది ప్రైజ్ వాటర్ హౌస్ కాపర్స్ (PWC) సర్వే చెబుతోంది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ అంశాలపై ఈ సంస్థ అధ్యయం చేస్తోంది. 29 దేశాల్లోని 2 లక్షల మంది ఉద్యోగుల స్కిల్స్ ఆధారంగా ఈ సర్వే చేసింది. విద్యార్హత, వయస్సు, జెండర్ ఆధారంగా కొన్ని ఉద్యోగాలు కనుమరుగు అయ్యే ప్రమాదం ఉందన్నారు.

ముఖ్యంగా వస్తువుల తయారీ రంగం (మ్యానుఫ్యాక్టరింగ్ ఇండస్ట్రీ)లో ఆటోమేషన్ ప్రభావం తీవ్రంగా ఉండనున్నంది. వ్యవసాయం, రియల్ ఎస్టేట్ తర్వాత అతిపెద్ద ఉపాధి కల్పనగా ఈ రంగం ఉంది. ఆటోమేషన్ ప్రభావం ఈ రంగంపై అధికంగా ఉండటంతో.. లక్షల మంది ఉపాధి కోల్పోనున్నారు. ఆ తర్వాత ఫైనాన్సియల్ సర్వీసెస్. అంటే బ్యాంకింగ్ రంగం. ఇందులో అన్ని కూడా ఆన్ లైన్ అవుతుండటంతో.. భవిష్యత్ లో ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత రవాణా రంగం. డ్రైవర్ లేని వాహనాలతోపాటు.. సరికొత్త మార్గాల్లో రవాణా ఉంటుంది. ఈ ప్రభావాన్ని అధిగమించాలి అంటే.. ఆయా రంగాల్లో వచ్చే మార్పులకు అనుగుణంగా ఉద్యోగులు శిక్షణ తీసుకోవాల్సి ఉంటుందని అధ్యయనం చెబుతోంది.

నిర్మాణ రంగంలోకి ఆటోమేషన్ వేగవంతంగా ఉందని.. దీంతో లక్షల మంది ఉపాధి కోల్పోనున్నారు. రాబోయే ఐదు, పదేళ్లలో యాంత్రీకరణ వల్ల మహిళలు ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోనున్నారు. రిసెప్షన్, అకౌంటెంట్ వంటి క్లరికల్ ఉద్యోగాలు చేసే వారికి ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం వీటిలో మహిళలే ఎక్కువగా ఉన్నారు. సరైన విద్యార్హత లేని వారు రానున్న రోజుల్లో మరిన్ని ఇబ్బందులు పడనున్నారు. మొత్తంగా చూస్తే రాబోయే పదేళ్లు ఉద్యోగులకు గడ్డు కాలమే అని చెప్పాలి. అదే సమయంలో కొత్త టెక్నాలజీని నేర్చుకోగలిగితే భారీ జీతాలతో మంచి ఉద్యోగాలూ వచ్చే అవకాశం ఉంది..

g1

 

 

 

 

 

g2

 

 

 

 

 

 

 

Posted in Uncategorized

Latest Updates