భరత్ అనే నేను సాంగ్ : వచ్చాడయ్యా సామీ

bharat ane nenuముసలి తాత ముడత ముఖం మురిసిపోయేనే.. గుడిసె పాక గుడ్డి దీపం మెరిసిపోయేనే అంటూ సెకండ్ సాంగ్ రిలీజ్ చేసింది భరత్ అనే నేను మూవీ యూనిట్. ఇందులో హీరో మహేశ్ సీఎం పాత్రలో నటిస్తున్నాడు. దీనికి సంబంధించి.. హీరోను పరిచయం చేసే సాంగ్ ఇది. సీఎం అయిన తర్వాత మా జీవితాల్లో వెలుగులు వచ్చాయని ప్రజలు పాడుకునే సాంగ్ ఇది. పల్లె బతుకు చిత్రాలనే ప్రతిబింభిస్తూ సాగుతుంది ఈ పాట.

రామజోగయ్య శాస్త్రి ఈ పాటను రాయగా.. కైలాష్ కేర్, దివ్యకుమార్ పాడారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఏప్రిల్ 20వ తేదీ విడుదల అవుతుంది. సాంగ్ రిలీజ్ అయిన గంటలోనే 5లక్షల వ్యూస్ తో దూసుకెళ్తోంది.

Posted in Uncategorized

Latest Updates