భరత్ బహిరంగ సభ ఫిక్స్

bharathకొరటాల శివ, మహేశ్‌ బాబు కాంబోలో వస్తున్న భరత్‌ అనే నేను ఏప్రిల్ 20 రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. భరత్‌ అనే నేను సినిమా ఫస్ట్‌ లుక్‌, ఫస్ట్‌ ఓత్‌, పాటలు ఇప్పటికే సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అయ్యాయి. అయితే లేటెస్ట్ గా భరత్‌ బహిరంగ సభ అంటూ ఒక పోస్టర్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది యూనిట్. అంటే రాజకీయ క్రమంలో ఉన్న సినిమా కావడంతో ఇలా ఆ రంగంలో ఉపయోగించే పదాలతో పబ్లిసిటీ ఇస్తున్నట్టు ఉంది యూనిట్‌. ఏప్రిల్‌ 7న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో భరత్‌ బహిరంగ సభ అంటూ పోస్టర్‌ను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను భరత్‌ బహిరంగ సభ అంటూ రిలీజ్‌ చేయడం మాత్రం కొత్తగా ఉంది. ఈ సభకు ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లను అతిథులుగా విచ్చేస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మహేష్ సరసన ఈ మూవీలో కైరా అద్వాని హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.

Posted in Uncategorized

Latest Updates