భరత్ మేకింగ్ రిలీజ్

Bharat-Ane-Nenu-Making-Vide (1)టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు లేటెస్ట్‌ మూవీ భరత్‌ అనే నేను ఏప్రిల్ 20న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను తనదైన స్టైల్లో తెరకెక్కించాడు కొరటాల శివ. మూవీకి సంబంధించిన మేకింగ్‌ వీడియోను ఆదివారం (ఏప్రిల్-8) నిర్మాత డీవీవీ దానయ్యకు చెందిన డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. మహేశ్‌ సీఎంగా కనిపించనున్న ఈ మూవీ మేకింగ్‌ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఈ సందర్భంగా మహేష్ ఈ వీడియోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేసి, సంతోషాన్ని పంచుకు్నాడు. 1నిమిషం 53 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో మూవీని ఎలాంటి వాతావరణంలో రూపొందిచ్చారన్నది తెలుస్తోంది. శనివారం (ఏప్రిల్-7) హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో భరత్‌ అనే నేను బహిరంగ సభ ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి హీరో మహేశ్‌ బాబు, సూపర్‌ స్టార్‌ కృష్ణ, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, డైరెక్టర్‌ కొరటాల శివ, నటి కియారా అద్వాని, నటుడు ప్రకాశ్‌ రాజ్‌, తదితరులు హాజరు కావడంతో సందడిగా ఈవెంట్‌ జరిగింది. డీవీవీ దానయ్య మూవీని నిర్మించగా.. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని మ్యాజిక్.

Posted in Uncategorized

Latest Updates